23న భీం అవార్డు ప్రదానోత్సవం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రేమలా గార్డెన్‌లో ఈనెల 23న నిర్వహించనున్న కుమురంభీం జాతీయ అవార్డు ప్రదానోత్సవాన్ని విజయవంతం చేయాలని నవజ్యోతి సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు ధర్మపురి వెంకటేశ్వర్లు కోరారు. ప్రముఖ సినీ నటుడు సాయికుమార్‌కు ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. స్వర్ణోత్సవాల నేపథ్యంలో కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న నవజ్యోతి సంస్థ ఏర్పాట్లపై సన్నద్ధ సమావేశాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయ ఆవరణలో నిర్వహించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి సాయిని రాజశేఖర్, కార్యనిర్వాహక అ ధ్యక్షుడు రామారావ్, ప్రతినిధులు చంద్రశేఖ ర్, రాధాకృష్ణాచారి, రమేశ్, సత్యనారాయణ, వెంకట్రావ్, శ్రీనివాస్, విజయ్‌కుమార్, గుండ వెంకన్న, సిడాం అర్జుమాస్టర్, సుధాకర్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment