స్థానిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగాలి
● పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి
ఆసిఫాబాద్‌అర్బన్: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టిన విధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్ర ంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం సన్మాన కార్యక్రమానికి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబుతో కలిసి హా జరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర పథకాలను గడపగడపకూ అందేలా చూడాలన్నారు. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలన్నారు. జిల్లాలో వనరులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. అనంతరం ఎమ్మెల్సీ అంజిరెడ్డిని శాలువాలతో సత్కరించారు. నాగేశ్వర్‌రావ్, కొత్తపల్లి శ్రీనివాస్, గోనె శ్యాంసుందర్‌రావ్, కోట్నాక విజయ్, అరిగెల మల్లికార్జున్, బోనగిరి సతీశ్‌బాబు, సెర్ల మురళి, మల్లారెడ్డి, రఘునాథ్, సొల్లు లక్ష్మి, కృష్ణకుమారి, సతీశ్, మాటూరి జయరాజ్, ప్రసాద్‌గౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment