‘పెండింగ్ వేతనాలు చెల్లించాలి’
ఆసిఫాబాద్‌రూరల్: పెండింగ్‌లో ఉన్న వేతనా లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గిరిజన ఆ శ్రమ పాఠశాలలో పనిచేస్తున్న వర్కర్లు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాకు ఆదివారం వి ద్యార్థి, యువజన సంఘాల నాయకులు మ ద్దతు తెలిపారు. ఈ సందర్భంగా హాస్టల్ డైలీ వెజ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని వర్కర్లు సమ్మె చేస్తుంటే అధి కారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. వెంటనే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని, జీవో 64 నిలిపి వేయాలని, 2014 నాటికి ఐదేళ్లు పూర్తయిన వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘం నాయకులు శ్రీనివాస్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సాయికృష్ణ, వివిధ సంఘాల నాయకులు పద్మ, దినకర్, రాజేందర్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment