‘అంగన్‌వాడీల ధర్నా విజయవంతం చేయాలి’
ఆసిఫాబాద్‌అర్బన్: అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని ఈనెల 17, 18 తేదీల్లో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న 48 గంటల ధర్నా విజయవంతం చేయాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి త్రివేణి పిలుపునిచ్చారు. ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసే పీఎంశ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్‌వాడీ సెంటర్‌ను వెంటనే రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన జాతీయ విద్యావిధానం చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఆపాలని, అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని శనివారం జిల్లా కేంద్రంలో ఐసీడీఎస్ పీడీ భాస్కర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్‌ను ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని, పేద ప్రజలతో పాటు అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్లకు నష్టం వాటిల్లే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు వనిత, సువర్ణ, వినోద, అంజలి, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment