మిషన్ భగీరథ నీళ్లు వచ్చేదెప్పుడు?
దహెగాం: కాగజ్‌నగర్ మండలం అందవెల్లి పెద్దవా గుపై కూలిన వంతెన స్థానంలో మరోవంతెన ని ర్మించారు. అప్రోచ్ రోడ్డు పనులు ప్రారంభించి నెల రోజులు కావస్తోంది. భగీరథ పైప్‌లైన్ కనెక్షన్ తొలగించి కూడా నెల దాటింది. అప్పటి నుంచి దహెగాం, భీమిని, కన్నెపల్లి మండలాల్లోని 64 గ్రామాల కు భగీరథ నీటి సరఫరా నిలిచి పోయింది. అప్రోచ్ రోడ్డు పనులు పూర్తయి వారంరోజులు కావస్తోంది. ప్రస్తుతం రివిట్‌మెంట్ పనులు కొనసాగుతుండగా అందుకు వాడే బండరాళ్లను రోడ్డుపై పైప్‌లైన్‌కు అడ్డుగా వేయడంతో పనులు చేయలేక పోతున్నామ ని భగీరథ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో నాలుగు మండలాల్లోని 64 గ్రామాల ప్రజలు తాగు నీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఆర్‌అండ్‌బీ అధి కారులు పనులు పూర్తి చేయలేక పోవడంతో తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి భగీరథ పైప్‌లైన్ వేయడానికి అడ్డుగా ఉన్న బండరాళ్లను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment