జిల్లాకు 47 మంది జూనియర్ లెక్చరర్లు
ఆసిఫాబాద్‌రూరల్: టీజీపీఎస్సీ నిర్వహించిన పరీక్షలో జూనియర్ లెక్చరర్లుగా ఎంపికై న వారు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం జి ల్లాకు 47 మంది జూనియర్ లెక్చర్లర్లను కే టాయించిందని డీఐఈవో కళ్యాణి తెలిపారు. జిల్లా కేంద్రంలో గురువారం పలువురు విధుల్లో చేరారు. కాగా, జిల్లాలో పదేళ్లుగా 61 మంది అతిథి అధ్యాపకులు పనిచేస్తున్నారు. నూతన అధ్యాపకులు చేరడంతో ఉపాధి కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు విద్యా వ్యవస్థలో అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment