విజయవాడ కల్చరల్: సాహిత్య రంగంలో నామినేటెడ్ పదవుల్లో ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారినే నియమించాలని ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి చిల్లర భవానీదేవి, చల పాక ప్రకాష్ బుధవారం ఓ ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీ, గ్రంథాలయ పరిషత్, రాష్ట్ర చైర్మన్లు, జిల్లాకు సంబంధించిన పోస్ట్‌లను ఆయా రంగాల్లో విశేష కృషి చేసివారిని మాత్రమే నియమించాలని సూచించారు. కళాకారులు, సాహితీవేత్తలకు ఇచ్చే ఉగాది పురస్కారాలను తిరిగి ప్రారంభించాలని కోరారు. భాషా సాంస్కృతిక శాఖ, ఏపీ సృజనాత్మక సమితి ద్వారా రచయితల పుస్తకాలకు ఆర్థిక సహాయం చేయాలని, ఆ పుస్తకాలను గ్రంథాలయ పరిషత్ ద్వారా కొనుగోలు చేయాలని, పాత బకాయిలు వెంటనే చెల్లించాలని విజ్ఞప్తిచేశారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని కోరారు.