మైలవరం: స్థానిక డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల హ్యాండ్‌బాల్ పురుషుల పోటీల విజేతగా విజయవాడ కేబీఎన్ కళాశాల జట్టు నిలిచింది. విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాల ద్వితీయ స్థానం, లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తృతీయ స్థానం దక్కించుకున్నాయి. ఈ టోర్నీ బుధవారం ముగిసింది. టోర్నీలో పాల్గొన్న అన్ని జట్ల నుంచి మెరుగైన క్రీడాకారులను కృష్ణా యూనివర్సిటీ హ్యాండ్‌బాల్ జట్టుకు ఎంపిక చేసినట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ మేజర్ మన్నేస్వామి తెలిపారు. ఎంపికై న జట్టు ఈ నెల 27 నుంచి తమిళనాడు రాష్ట్రం సేలంలోని పెరియార్ యూనివర్సిటీ నిర్వహించే దక్షిణ భారత విశ్వవిద్యాలయ పోటీలకు ప్రాతి నిధ్యం వహిస్తుందని పేర్కొన్నారు. డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల చీఫ్ డోనర్ డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి, గ్లోబల్ స్టార్ కన్సల్టెన్సీ ఎండీ జె.చంద్రశేఖరరెడ్డి చేతులు మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇళ్ల రవి తది తరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment