● విజ్ఞాన మడి.. జ్ఞాపకాల జడి
జ్ఞాపకాల దొంతరలు కమ్ముకున్న వేళ.. తరగతి గదుల్లో నేర్చుకున్న విజ్ఞాన సౌరభాలు మరోమారు సుగంధాలు వెదజల్లుతున్న సమయాన.. కలిసి ఆడుకున్న దృశ్యాలు మళ్లొకసారి కళ్లెదుటే పరుగులు పెడుతున్న తరుణాన.. గురువులతో పెనవేసుకున్న ఆనాటి అనుబంధాలు మనస్సుకు హత్తుకుని మైమరచిపోతూ ఉండగా.. వొడవని ముచ్చట్లు ఆ విద్యాలయాన్ని పులకింపజేశాయి. తొమ్మిది దశాబ్దాల నుంచి విద్యనభ్యసించిన వారంతా చదువులమ్మ చెట్టు నీడలో ఒక్కటిగా చేరి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చల్లపల్లిలోని శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామప్రసాద్(ఎస్‌ఆర్‌వైఎస్‌పీ) జూనియర్ కళాశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక నిర్వహించారు. పాఠశాల ప్రారంభించిన 1932 నుంచి 2024 వరకూ మొత్తం 92 బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు. – చల్లపల్లి
Comments
Please login to add a commentAdd a comment