శ్రీశైల మల్లన్నకు పట్టువస్త్రాల సమర్పణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలభ్రమరాంబ సమేత మల్లి కార్జున స్వామి వార్లకు దుర్గగుడి తరఫున ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించారు. దుర్గగుడి ఈఓ కె.రామచంద్ర మోహన్, ఆలయ అర్చకులు శ్రీశైలం మల్లికార్జునుడికి పట్టువస్త్రాలను సమ ర్పించేందుకు వెళ్లగా, శ్రీశైలం దేవస్థాన ఈఓ శ్రీని వాసరావు, ఆలయ వేద పండితులు, అర్చకులు స్వాగతం పలికారు. మేళతాళాలు, మంగళవాయి ద్యాల నడుమ ఆలయానికి చేరుకున్న దుర్గగుడి అధికారులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు, పూజా సామగ్రి, అమ్మవారి ప్రసాదాలను ఈఓ శ్రీనివాసరావుకు అందజేశారు. కార్యక్రమంలో దుర్గగుడి స్థానాచార్య శివప్రసాద్ శర్మ పాల్గొన్నారు.
కూచిపూడి నాట్య పుస్తకావిష్కరణ
కూచిపూడి(మొవ్వ): కణ్వపురి పాండురంగ విఠల్ రూపొందించిన ఏ 50 ఫేస్‌బుక్స్ కేటలాగ్ ఆన్ కూచిపూడి డ్యాన్స్ పుస్తకాన్ని కళారత్న డాక్టర్ వేదాంతం రాధేశ్యాం, ముదిగొండ శాస్త్రి ఆదివారం శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆవిష్కరించారు. కూచిపూడి గ్రంథాలయం అధికారి ఏలేశ్వరపు ఫణికుమార్, నాట్యాచార్యులు ఏలేశ్వరపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైల మల్లన్నకు పట్టువస్త్రాల సమర్పణ
Comments
Please login to add a commentAdd a comment