మంగళగిరిటౌన్: శివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జునస్వామికి అలంకరించే తలపాగాకు ఆదివారం మంగళగిరిలో గ్రామోత్సవం నిర్వహించారు. తొలుత శివాలయంలో తలపాగాకు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఊటుకూరు సుబ్రహ్మణ్య స్వామి, మాడిశెట్టి శివశంకరయ్య మాట్లాడుతూ మల్లికార్జునస్వామి వారి పెండ్లికుమారుని ఉత్సవం దేవాంగులు నేసిన తలపాగా వస్త్ర విశిష్టత గురించి కొనియాడారు. గ్రామోత్సవం ఆలయం నుంచి శివనామ స్మరణతో గండాలయ పేట, ఘాట్‌పేట, గాలిగోపురం మెయిన్‌బజార్ మీదుగా పాత మంగళగిరి, టిడ్కో గృహ సముదాయం, రత్నాల చెరువు నుంచి తిరిగి దేవస్థానానికి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment