గుడివాడలో అరుదైన శస్త్రచికిత్స
గుడివాడటౌన్: ముప్పై వేల మందిలో ఒకరికి వచ్చే సమస్యకు తమ ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించినట్లు వైద్యుడు డాక్టర్ పొట్లూరి వంశీకృష్ణ తెలిపారు. ఆదివారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలో ఏలూరు రోడ్‌లో గల శ్రీరామా నర్సింగ్ హోమ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాధారణంగా మనిషికి ఎడమవైపు గుండె, కాలేయం, పిత్తాశయం, క్లోమం ఉంటాయన్నారు. కానీ పట్టణానికి చెందిన మహిళకు ఇవి కుడివైపున ఉన్నాయన్నా రు. దీనిని సైటస్ ఇన్వర్‌సస్ పొటాలిస్ అంటారన్నారు. సాధారణంగా 30 వేల మందిలో ఒకరికి ఇలా ఉంటుందన్నారు. ఈ స్థితిలో గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడితే దాని శస్త్రచికిత్స ఎంతో కష్టం అన్నారు. ఈ మహిళకు గతనెల ఎడమ పక్క డొక్కలో నొప్పి వస్తుందని ఆస్పత్రికి రాగా స్కానింగ్‌లో గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నట్లు గమనించామన్నారు. వెంటనే ఆపరేషన్ చెయ్యాలని సూచించినా.. వారు ఆలస్యం చెయ్యడంతో గాల్‌బ్లాడర్‌లోని ఒకరాయి గాల్‌బ్లాడర్, కాలేయానికి మధ్య ఇరుక్కుపోవడంతో అది ప్రమాదకరంగా మారిందన్నారు. డాక్టర్ పి. వసుంధర, డాక్టర్ ఎన్. శివప్రసాద్ సహకారంతో ఈ శస్త్ర చికిత్స నిర్వహించామన్నారు. అనంతరం దీని గురించి పూర్తి సమాచారం సేకరించగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ విధమైన ఆపరేషన్‌లు 32 జరిగినట్లు సమాచారం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment