సహకార రంగం బలోపేతానికి చర్యలు
చిలకలపూడి(మచిలీపట్నం): సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు జిల్లా సహకార అధికారి కె. చంద్రశేఖరరెడ్డి అన్నారు. కేడీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం పీఏసీఎస్ సీఈవోలతో సమావేశాన్ని నిర్వహించారు. డీసీవో మాట్లాడుతూ 2025ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించారన్నారు. సహకార సంస్థలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయనే అంశంపై ఈ ఏడాది సహకార రంగంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చేలా ప్రణాళికను రూపొందిస్తున్నారన్నారు. స్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030 నాటికి అందుకోవాలంటే ప్రపంచ దేశాలు సహకార రంగంలో పురోగమిస్తేనే సాధ్యమవుతుందని ఐక్య రాజ్యసమితి గుర్తించటం అభినందనీయమన్నారు. జిల్లాలోని పీఏసీఎస్‌లలో కంప్యూటరీకరణ చివరిదశకు చేరుకుందని ఈ నెలాఖరు నాటికి నూరుశాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మెరుగైన సేవలే లక్ష్యం..
కేడీసీసీ బ్యాంకు సీఈవో శ్యామ్‌మనోహర్ మాట్లాడుతూ కంప్యూటరీకరణ ప్రక్రియ ఎదురయ్యే సాంకేతిక సమస్యలను అధిగమిస్తూ త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డివిజనల్ కో–ఆపరేటివ్ అధికారి ఫణికుమార్ మాట్లాడుతూ కంప్యూటరీకరణ చేస్తే ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించవచ్చునన్నారు. జనరల్ మేనేజర్ బీఎల్ చంద్రశేఖర్, కేబీ రంగరాజు తదితరులు పాల్గొన్నారు. తొలుత ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కో–ఆపరేటివ్స్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
డీసీవో చంద్రశేఖరరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment