హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ , ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో మంగళవారం కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఫెడరేషన్ ఆధ్వర్యాన నిరసన దీక్ష జరిగింది. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ ఏవీ నాగేశ్వరరావు దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. మినిమం టైం స్కేల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కల్యాణి మాట్లాడుతూ సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, వేతనాలు, సౌకర్యాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పదఈ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు చేయాలన్నారు. గ్రాట్యూటీ, మెడికల్ సెలవులు – హెల్త్ కార్డులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతికి మార్చాలన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని, పార్ట్ టైం పదాన్ని పూర్తిగా తొలగించాలన్నారు. కొన్ని క్లస్టర్లలో సీఆర్‌పీలను తొలగించారని, తక్షణమే విధుల్లోకి తీసుకోవాలన్నారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు పోరాడదామన్నారు. దీక్షలో కాంట్రాక్ట్ –ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ చైర్మన్ బి.కాంతారావు, ఆర్గనైజేషన్ సెక్రెటరీ జాన్ మోడీ, వైస్ చైర్మన్ వాసా శ్రీనివాసరావు, మహమ్మద్ రఫీ, ఉద్యోగులు పాల్గొన్నారు.
కాంట్రాక్ట్ , ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్
Comments
Please login to add a commentAdd a comment