ఘనంగా అక్కినేని విగ్రహావిష్కరణ
గుడివాడ టౌన్: ప్రముఖ సినీ నటుడు, గుడివాడ ప్రాంతవాసి అక్కినేని నాగేశ్వరరావు విగ్రహావిష్కరణ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విశ్వభారతి విద్యాసంస్థల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో స్థానిక రాజేంద్రనగర్‌లోని విశ్వభారతి హైస్కూల్ ప్రాంగణంలో అక్కినేని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ జరిగింది. అక్కినేని మనుమడు సుమంత్ ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ తమ తాత అక్కినేని నాగేశ్వరరావుకు విశ్వభారతి అధినేత పొట్లూరి శ్రీమన్నారాయణకు మంచి స్నేహం ఉండేదన్నారు. తాత మృతి చెంది ఏళ్లు అయినా కూడా ఆ బంధం తమ కుటుంబ సభ్యులతో ఇంకా కొనసాగుతుందని చెప్పారు. ఆయనను గుర్తు చేసుకుంటూ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీమన్నారాయణ కుటుంబ సభ్యులకు, విశ్వభారతి యాజమాన్యానికి తాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. కార్యక్రమంలో నాగ సుశీల, సుప్రియ, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
విగ్రహాన్ని ఆవిష్కరించిన అక్కినేని కుటుంబసభ్యులు
Comments
Please login to add a commentAdd a comment