బందరు జీజీహెచ్‌లో మౌలిక వసతులకు ప్రాధాన్యం
చిలకలపూడి(మచిలీపట్నం): కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులు రూ. 45 లక్షలతో మచిలీపట్నం సర్వజన ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. వైద్యాధికారులు ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితులను వివరిస్తూ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరుగుతున్న దృష్ట్యా అదనంగా మంచాలు, ఎక్స్‌రే వంటి వైద్య పరికరాలు, ఆపరేషన్ థియేటర్‌లో బెడ్లు, టేబుళ్లు, ఐసీయూ బెడ్లు వంటివి అవసరం ఉందని కలెక్టర్‌కు వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ రూ. 20 లక్షలతో ఎక్స్‌రే సీఆర్ సిస్టమ్, ఇతర పరికరాల కొనుగోలుకు మరో రూ. 25 లక్షలు సీఎస్‌ఆర్ నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి. ఆశాలత, డీసీహెచ్‌ఎస్ ఎం. జయకుమార్, సీపీవో గణేష్‌కృష్ణ పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
Comments
Please login to add a commentAdd a comment