వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆ సంస్థ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యువీ సుబ్బారావు తెలిపారు. ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లను వారి గుర్తింపు కార్డులను పరీక్ష కేంద్రంలోని సూపరింటెండెంట్‌కు చూపించి పరీక్షకు హాజరుకావచ్చని పేర్కొన్నారు. కొంత మంది స్టడీ సెంటర్ల నిర్వాహకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లను సైతం అనుమతిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment