
జిల్లా అఽధికారులతో కృష్ణా కలెక్టర్ సమీక్ష
పెనమలూరు: పోరంకిలోని తాడిగడప మున్సిపల్ కార్యాలయంలో కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 5వ తేదీన పోరంకిలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఇంటికి వస్తున్న సందర్భంగా ఏర్పాట్లపై కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కుమారుడి వివాహం అయిన సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించటానికి సీఎం రానున్నారు. సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ గంగాధరరావు, మున్సిపల్ కమిషనర్ భవానీప్రసాద్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. అదే రోజు వీఆర్ సిద్ధార్థ కాలేజీ గ్రౌండ్స్‌లో వివాహ విందు భోజనాల ఏర్పాట్లను పురస్కరించుకుని కళాశాల మైదానంలో ఎస్పీ గంగాధరరావు పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment