హనుమాన్‌జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం కానుమోలులో ఇటీవల జరిగిన చోరీ కేసుకు సంబంధించి ఇద్దరు దొంగలను హనుమాన్‌జంక్షన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. గ్రామానికి చెందిన వీఆర్‌ఏ గద్దె విక్టర్ కుటుంబ సభ్యులతో కలిసి పొరుగూరు వెళ్లగా ఆయన ఇంట్లో గత నెల 24న చోరీ జరిగింది. బీరువాలోని రూ.65 వేల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. ఈ ఘటనపై వీఆర్‌ఏ విక్టర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో క్లూస్ టీం ద్వారా దొంగల వేలిముద్రలను సేకరించారు. పాత నేరస్తులే చోరీకి పాల్పడినట్లుగా నిర్థారించారు. ఆ వేలి ముద్రల ఆధారంగా నిందితులు కొఠారు శ్రీనివాస్ (కాకినాడ), షేక్ మున్నా (ఏలూరు)లను సోమవారం హనుమాన్‌జంక్షన్ ఎస్‌ఐ–2 నరసింహమూర్తి అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment