
బెల్టు దుకాణాలపై ఎన్‌ఫోర్సుమెంటు దాడులు
పెడన: మచిలీపట్నం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో గత రెండు రోజులుగా బెల్టు దుకాణాలపై దాడులు నిర్వహించి పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఫోర్సుమెంటు ఇన్‌స్పెక్టర్ పి.వెంకటేశ్వరమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ ఎన్‌ఫోర్సుమెంట్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ వై.శ్రీనివాస చౌదరి ఆదేశాలతో ఆది, సోమవారాల్లో దాడులు నిర్వహించామన్నారు. గూడూరు మండలం పిండివారిపాలెంలో బెల్టు దుకాణం నిర్వహిస్తున్న గంజాల రామచంద్రరావు నుంచి 20 క్వార్టరు మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని అతని అరెస్ట్ చేశామన్నారు. పెడన పట్టణంలోని రామలక్ష్మీ వీవర్స్ కాలనీలోని పేరక శ్రీకాంత్ నుంచి 17 క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశామన్నారు. మచిలీపట్నం మండలం పోతేపల్లిలో పామర్తి నాగరాజు నుంచి 17 క్వార్టర్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మచిలీపట్నం వైఎస్సార్ కాలనీకి చెందిన షేక్ మదర్‌బీ నుంచి 70 క్వార్టరు మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నామన్నారు. తదుపరి చర్యల నిమిత్తం సోమవారం ఈ నలుగురితో పాటు మద్యం సీసాలను మచిలీపట్నం ఎకై ్సజ్ స్టేషన్‌కు అప్పగించామని వెంకటేశ్వరమ్మ తెలిపారు. దాడుల్లో తనతో పాటు విజయవాడకు చెందిన ఎన్‌ఫోర్సుమెంటు ఎస్‌ఐ ఎం.రామశేషయ్య, హెచ్‌సీ కె.మధు పాల్గొన్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment