
ముగిసిన ముక్తేశ్వరుని కల్యాణ మహోత్సవాలు
వేదాద్రి(జగ్గయ్యపేట): గ్రామంలో ఉన్న శ్రీ భవానీ ముక్తేశ్వరస్వామి కల్యాణమహోత్సవాలు సోమవారం రాత్రి పవళింపు సేవతో ముగిశాయి. ఈ సందర్భంగా సోమవారం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో అర్చకులు వారణాసి సాంబశివరావు, తూమాటి లక్ష్మీనరసింహాచార్యులు, మద్దిరాల ప్రేమకుమార్‌శర్మ ఆధ్వర్యంలో పవళింపు సేవ నిర్వహించారు. కల్యాణోత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించామని ఆలయ ఈవో కానూరి సురేష్‌బాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో కేసీపీ ప్రతినిధి రాంప్రసాద్, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగిన ముక్తేశ్వరుని కల్యాణ మహోత్సవాల్లో స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ.7.53 లక్షల ఆదాయం సమకూరిందని ఈవో సురేష్ తెలిపారు. లడ్డు విక్రయం ద్వారా రూ.1.10 లక్షలు, దర్శనం టికెట్ల ద్వారా రూ.2.50 లక్షలు, కానుకల ద్వారా రూ.3 లక్షలు, అభిషేకాల ద్వారా రూ.86వేలు, కొబ్బరిచిప్పల విక్రయం ద్వారా రూ.59వేలు వచ్చిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment