భవానీపురం(విజయవాడపశ్చిమ): అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ హోదా రద్దైందని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) చైర్మన్ నూకసాని బాలాజీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్లూ ఫ్లాగ్ స్టేటస్‌కు పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే పసికట్టి అధికారులను హెచ్చరించానని గుర్తు చేశారు. అక్కడ ఉన్న ఏజెన్సీ కాలపరిమితి ముగియడంతో చర్యలు తీసుకోవాలని వైజాగ్ కలెక్టర్‌ను కోరినట్లు చెప్పారు. తన పర్యటన సందర్భంగా అక్కడ పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే గుర్తించి మినిట్స్ రూపంలో ఏపీటీడీసీ ఎండీ ద్వారా అధికారులకు సర్క్యులేట్ చేయించానని గుర్తు చేశారు. అయినా సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా బ్లూ ఫ్లాగ్ స్టేటస్‌కు ప్రమాదం ఏర్పడే పరిస్థితి దాపురించడం శోచనీయమని పేర్కొన్నారు. ఇకపై నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారుల పెర్ఫామెన్స్ ప్రాతిపదికన త్వరలో అంతర్గత బదిలీలు చేపడతామని పేర్కొన్నారు.
ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజి
Comments
Please login to add a commentAdd a comment