
ప్రపంచ పారా అథ్లెటిక్స్‌కు ముగ్గురు రాష్ట్ర క్రీడాకారుల
విజయవాడస్పోర్ట్స్: వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్–2025కు ప్రాతినిధ్యం వహించే భారత జట్టులో ముగ్గురు రాష్ట్ర క్రీడాకారులు చోటు దక్కించుకున్నారని ఏపీ పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు జి.కోటేశ్వరరావు, వి.రామస్వామి తెలిపారు. ఎఫ్–40 కేటగిరిలో ఆర్.రవి(అనకాపల్లి), టి–11 కేటగిరిలో కె.లలిత(పార్వతిపురం), టి–35 కేటగిరిలో టి.రాము(శ్రీకాకుళం) ప్రపంచ పోటీలకు అర్హత సాధించారని వెల్లడించారు. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్–2025 పోటీల్లో పాల్గొంటారన్నారు. ప్రపంచ పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులను ఏపీ క్రీడా ప్రాఽథికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు, ఎండీ పి.ఎస్.గిరీష అభినందించారు. టీల్లో రాణించి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.
నృసింహుని ఏకాదశ మాలధారణ దీక్ష స్వీకరణ
మంగళగిరిటౌన్: మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎగువ సన్నిధిలోని పానకాలస్వామి వారి ముఖ మండపంలో మంగళవారం భక్తులు నృసింహుని ఏకాదశ మాలధారణ దీక్ష స్వీకరణ మహోత్సవం జరిగింది. దేవస్థానం ప్రధాన అర్చకులు, గురుస్వామి మాల్యవంతం శ్రీనివాసదీక్షితులు భక్తులకు మాలవేసి దీక్ష ఇచ్చారు. స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవా ట్రస్ట్ అధ్యక్షుడు తోట శ్రీనివాసరావు మాలధారణ దీక్ష స్వీకరించే భక్తులకు దీక్షా వస్త్రాలను ఉచితంగా అందజేశారు. అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు, న్యాయవాది రంగిశెట్టి లక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో శివారెడ్డి గురుస్వామి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు గోగినేని వెంకటేశ్వరరావు, రోటరీ క్లబ్ ప్రతినిధి సైదా నాయక్, తదితరులు పాల్గొన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడిపిన 32 మందికి జరిమానా
విజయవాడలీగల్: నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 32 మందికి న్యాయస్థానం జరిమానా విధించింది. నగరంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి నగర పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాల్లో మద్యం సేవించిన వాహనచోదకులపై 5వ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మంగళవారం ఆరో అదనపు జ్యుడీషియల్ మెట్రోపాలిటన్ న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి లెనిన్ బాబు 8 మందికి ఒక్కొక్కరికి 15వేలు చొప్పున, మిగిలిన 24 మందికి ఒక్కొక్కరికి 10వేలు చొప్పున జరిమానా విధించారు.

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌కు ముగ్గురు రాష్ట్ర క్రీడాకారుల

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌కు ముగ్గురు రాష్ట్ర క్రీడాకారుల
Comments
Please login to add a commentAdd a comment