
మల్కాపురం, ముచ్చింతాల రిజిస్ట్రేషన్ కొనసాగింపు
జిల్లా రిజిస్ట్రార్ దుర్గాప్రసాద్
జగ్గయ్యపేట అర్బన్: రగామ పంచాయతీ పెండింగ్ సెస్ టీడీ ఎమౌంట్ ఏప్రిల్‌లో విడుదల అవుతుందని, మల్కాపురం, ముచ్చింతాల గ్రామాల రిజిస్ట్రేషన్ కొనసాగుతుందని జిల్లా రిజిస్ట్రార్ పీవీవీ దుర్గాప్రసాద్ అన్నారు. జగ్గయ్యపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మంగళవారం జిల్లా రిజిస్ట్రార్ దుర్గాప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో సుమారు రూ.44 కోట్ల ప్రభుత్వ టార్గెట్‌లో 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి నాటికి 10,788 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌తో సుమారు రూ. 39.17కోట్ల 34 శాతంగా ఉందన్నారు. ప్రస్తుతం రూ.59.18 కోట్ల టార్గెట్ రావాల్సి ఉండగా 2024 ఏప్రిల్ 2025 ఇప్పటి వరకు 8601 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌తో రూ.29.83 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందన్నారు. దీంతో గత ఏడాది కన్నా 1,049 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు తగ్గడమే కాకుండా 18 శాతం ఆదాయం ఈ కార్యాలయం నుంచి తగ్గిందన్నారు. ఇప్పటికే మల్కాపురం, ముచ్చింతాల గ్రామాల రిజిస్ట్రేషన్ కొనసాగడంలేదని మీడియా సమాచారంతో అత్యవసరంగా డీఆర్, డీఐజీతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే తిరిగి రిజిస్ట్రేషన్ కొనసాగించేలా సమస్యను పరిష్కరించారు. జగ్గయ్యపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి నవంబర్ 2023 నుంచి నేటి వరకు రావాల్సిన సెస్ టీడీ ఎమౌంట్ అందక పంచాయతీలు ఇబ్బందులు పడుతున్నాయన్న మీడియా ప్రశ్నలకు.. ఇది కలెక్టర్ దృష్టిలో ఉందని, పంచాయతీ పెండింగ్ ఎమౌంట్‌ను ఏప్రిల్‌లో వారికి చెల్లిస్తామన్నారు. జిల్లాలో ఇప్పటికే క్లర్క్ ఆఫీస్ సబార్డినేటర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఎటువంటి అభ్యంతరం లేని ఓటీఎస్‌కు పట్టాలకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. త్వరలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో బిల్డర్లతో రిజిస్ట్రేషన్ పెంచడానికి అవగాహన సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు. కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్ సిబ్బంది, బిల్డర్స్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment