
దుర్గమ్మ సన్నిధిలో సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో బుధవారం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఏడో అంతస్తు లోని కళావేదికపై ఆలయ అర్చకులు ఈ వేడుక జరిపించారు. తొలుత అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఉపాలయమైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ కళావేదిక వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. కళావేదికపై ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరింపించారు.
నేడు గీత కార్మికులకు వైన్ షాపుల కేటాయింపు
గుడ్లవల్లేరు: జిల్లా గీత కార్మికులకు ప్రభుత్వం మంజూరు చేసిన 12 వైన్ షాపుల కేటాయింపునకు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు మచిలీపట్నం కలెక్టరేట్‌లో డ్రా నిర్వహిస్తామని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి.గంగాధరరావు బుధవారం తెలిపారు. ఈ షాపులకు 286 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. మచిలీపట్నం కార్పొరేషన్ నుంచి 40, గుడివాడ మునిసిపాలిటీ 32, పెడన మునిసిపాలిటీ 13, తాడిగడప మునిసిపాలిటీ 60, గూడూరు మండలం నుంచి 17, గుడివాడ రూరల్ మండలం 15, పమిడిముక్కల మండలం 30, పెడన మండలం 16, మచిలీపట్నం మండలం 16, కోడూరు మండలం 14, పెదపారుపూడి మండలం 11, బంటుమిల్లి మండలం నుంచి 22 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. దరఖాస్తుదారులు ఉదయం ఎనిమిది గంట లకే వేదిక వద్దకు హాజరు కావాలని ఈఎస్ గంగాధరరావు పేర్కొన్నారు.
గంజాయి విక్రేతపై పీడీ యాక్ట్
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజాయి బ్యాచ్ సభ్యుడు కొండ రమేష్ అలియాస్ చిన్న చిచ్చాపై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు వెస్ట్ ఏసీపీ దుర్గారావు పేర్కొన్నారు. లంబాడీపేటకు చెందిన 22 ఏళ్ల రమేష్‌పై విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్‌లలో గంజాయి రవాణా, విక్రయాలపై పలు కేసులు నమోదయ్యాయిని పేర్కొన్నారు. కొత్త పేట పోలీస్ స్టేషన్‌లో రెండు, భవానీపురం పీఎస్‌లో రెండు, జి.కొండూరు పీఎస్, మైలవరం పీఎస్‌లో ఒక్కో కేసు నమోదవగా, దొంగ తనాలు, దారిదోపిడీ వంటి 34 కేసులున్నట్లు పోలీసు రికార్డుల్లో ఉందన్నారు. కొన్ని కేసుల్లో శిక్షలు పడగా, మరి కొన్ని కేసులు విచారణలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం వైజాగ్ సెంట్రల్ జైల్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్న రమేష్‌పై పీడీ యాక్ట్ అమలుతో ఏడాది పాటు బెయిల్ లభించదన్నారు. గంజాయిని పూర్తిగా నిషేధించా లనే భావనతో గంజాయి బ్యాచ్‌పై పీడీ యాక్ట్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.
ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 424 మంది గైర్హాజరు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఇంటర్మీడియెట్ పరీక్షలకు బుధవారం 424 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలకు 17 పరీక్ష కేంద్రాలను అధికారులు కేటాయించారు. బుధవారం 2,405 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 1981 మంది హాజరయ్యారు. నగరంలోని బీఎస్‌ఆర్‌కే ఎంసీ హైస్కూల్, గాంధీజీ మున్సిపల్ హైస్కూల్, ఏపీఎస్‌ఆర్‌ఎం మునిసిపల్ హైస్కూల్ తదితర పరిక్ష కేంద్రాలను ఎన్టీఆర్ జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బా రావు బుధవారం పరిశీలించారు. తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, విజయవాడలోని పలు పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు.
19,200 మంది
ఇంటర్ పరీక్షకు హాజరు
చిలకలపూడి(మచిలీపట్నం): ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష బుధవారం జరిగింది. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 19,475 మంది విద్యార్థులు హాజరుకావాలి. 19,200 మంది హాజరైనట్లు ఆర్‌ఐఓ పి.బి.సాల్మన్‌రాజు తెలిపారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు తొమ్మిది మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఒకేషనల్ విద్యార్థులు 655 మందికి 623 మంది పరీక్ష రాశారు. ఇంగ్లిష్ పరీక్షలో విద్యార్థులు ఇబ్బందు లుపడ్డారు. ప్రశ్న పత్రంలో 8, 13 క్వశ్చన్లు సరిగా కనపడకపోవటంతో ఇన్విజిలేటర్లకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అనంతరం ఇన్విజిలేటర్లు 10 నిమిషాల పాటు సంబంధిత క్వశ్చన్లను విద్యార్థులకు కొన్ని కేంద్రాల్లో చదివి వినిపించటం, కొన్ని కేంద్రాల్లో బోర్డు మీద రాసి వివరించడం చేశారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment