
వంటా వార్పుతో నిరసన
గుడ్లవల్లేరు: వెటర్నరీ విద్యార్థుల వసతి గృహాలను ప్రభుత్వం మూసివేయటం తగదని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్ అన్నారు. హాస్టళ్ల మూసివేతను నిరసిస్తూ బుధవారం ఉదయం నుంచి పశు వైద్య విద్యార్థులు అందరూ కాలేజీల గేట్ల బయట, రోడ్లపై వంటావార్పుతో నిరసన తెలిపారు. సాయికుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు న్యాయం కోసం పోరాడుతుంటే హాస్టళ్లకు తాళం వేయాలని ప్రభుత్వం ఆదేశాలివ్వడం అన్యాయమన్నారు. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం విద్యార్థులు తిరుపతి, ప్రొద్దుటూరు, గన్నవరం, గరివిడి కాలేజీల్లో 32రోజులుగా వైద్య విద్యార్థులతో సమానంగా తమకు కూడా గౌరవ వేతనం ఇవ్వా లని తరగతులను బహిష్కరించి వెటర్నరీ విద్యార్థులు నిరాహార దీక్షలు చేస్తున్నారని పేర్కొన్నారు. చెప్పారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ యాజమాన్యం సమస్యను పరిష్కరించకపోగా దీక్షాపరులపై కక్ష పూరితకంగా వ్యవహరిస్తూ హాస్టళ్లను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఏఐ ఎస్‌ఎఫ్ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment