డెప్యూటీ సీఎం గన్నవరం పర్యటన వాయిదా
గన్నవరం: స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా శుక్రవారం జరగాల్సిన స్వర్ణ పంచా యతీ వెబ్‌సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఈ మేరకు అధికార వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. రెండు, మూడు వారాల తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి పలు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది మూడు రోజులుగా శ్రమిస్తున్నారు. జాతీయ రహదారి నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వరకు రోడ్డు నిర్మించడంతోపాటు కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. కళాశాల ఆవరణలో స్టేజీ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పర్యటన వాయిదాపడింది.
‘టీబీ ముక్త్ పంచాయతీ’ కమిటీ సమావేశం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో టీబీ ముక్త్ పంచాయతీలుగా ఎంపికై న ఇబ్రహీంపట్నం, మూలపాడు, నందిగామ మండలం పల్లగిరి గ్రామాలు కమిటీ సభ్యులు పరిశీలన పూర్తి కాగా, ఆ కమిటీల సమావేశం గురువారం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ మాచర్ల సుహసిని అధ్యక్షతన నగరంలోని తమ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. జిల్లా టీబీ అధికారి డాక్టర్ జె ఉషారాణి, డాక్టర్ కె. శ్రీనివాసరావు , ఐఎంఏ ప్రతినిధి డాక్టర్ విజయ్ కృష్ణ , డీపీసీ దినేష్ చాట్రగడ్డ, లీలా కుమార్, తిరుపతమ్మ పాల్గొన్నారు.
రేపు జాతీయ లోక్ అదాలత్
విజయవాడలీగల్: విజయవాడ కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని మండల న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్, రెండో అదనపు జిల్లా జడ్జి ఎ.సత్యానంద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీర్ఘకాలంగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్, పరిష్కరించదగిన క్రిమినల్ కేసులను లోక్‌అదాలత్ ద్వారా త్వరితగతిన కక్షిదారులు పరిష్కరించుకునేందుకు ఇదొక చక్కని అవకాశమని సూచించారు. జాతీయ లోక్ అదాలత్ కోసం 12 బెంచ్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
డెప్యూటీ సీఎం గన్నవరం పర్యటన వాయిదా
Comments
Please login to add a commentAdd a comment