విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం
మల్లాయి చిట్టూరు(ఘంటసాల): విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక ఇల్లు, నాలుగు పశువుల పాకలు, రెండు గడ్డి వాములు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం ఘంట సాల మండలం మల్లాయి చిట్టూరు శివారు మామిడితోట గ్రామంలో గురువారం జరిగింది. మచిలీపట్నం ఏడీఎఫ్‌ఓ బి.నరసింహారావు కథనం మేరకు.. మల్లాయి చిట్టూరు శివారు గ్రామమైన మామిడితోటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎండిన ఆకులకు నింప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. సమీపంలోని ఇంటికి ఆ మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న నాలుగు పశువుల పాకలు, రెండు గడ్డి వాములకు మంటలు అంటుకున్నాయి. గ్రామస్తులు మచిలీపట్నం అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఏడీఎఫ్‌ఓ బి.నరసింహారావు ఆధ్వర్యంలో సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో లోయ కాశీరత్నంనకు చెందిన రెండు పశువుల పాకలు, ఐదు ఎకరాల గడ్డివామి, లోయ చిన్న శ్రీనివాసరావుకు చెందిన ఇల్లు, రెండు ఎకరాల వరిగడ్డివామి, లోయ సుబ్బమ్మ, లోయ బేబీ సరోజినికి చెందిన పశువుల పాకలు బుగ్గిపాలయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.5 లక్షల ఆస్తినష్టం జరిగిందని ఏడీఎఫ్‌ఓ నరసింహారావు తెలిపారు. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేయడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. మంటలు చెల రేగిన వెంటనే పశువులను పాకల నుంచి బయటకు తోలడంతో వాటికి ప్రాణాపాయం తప్పింది.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment