పేదరిక నిర్మూలన కోసం పీ4 సర్వే
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్‌షిప్ (పీ4) సర్వే నిర్వహించనుందని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేకాధికారులతో సర్వే నిర్వహణపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఈ సర్వే జరుగుతుందని తెలిపారు. ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు తమ పరిధిలోని సచివాలయ సిబ్బందికి సర్వేపై పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని నెరవేర్చేందుకు కృషి చేయాలన్నారు. అట్టడుగున ఉన్న పేద కుటుంబాలకు మద్దతుగా నిలిచేలా ప్రోత్సహిం చటం పీ4 సర్వే లక్ష్యమన్నారు. పేదల అవసరాలను గుర్తించి వారి సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల రూపకల్పనకు ఈ సర్వే దోహదపడుతుందన్నారు. ఈ సర్వేలో కచ్చితమైన డేటాను సేకరించాలన్నారు. కుటుంబాలు ప్రస్తుతం అందుకుంటున్న పధకాలపై ఈ సర్వే ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేస్తూ సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ఇంటి అవసరాలకు అనుగుణంగా సమర్ధవంతమై న ప్రణాళిక రూపకల్పనకు వీలవుతుందని వివరించారు. ఈ సమాచారాన్ని కుటుంబాలకు వివరించి వారికి ఉన్న అపోహలు తొల గించి పది రోజుల్లో సర్వేను పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో సీపీఓ గణేష్‌కృష్ణ, జెడ్పీ డెప్యూటీ సీఈఓ ఆనంద్‌కుమార్, గ్రామ/వార్డు సచివాలయాల జిల్లా సమన్వయకర్త కె.రవికాంత్, బందరు మునిసిపల్ కమిషనర్ బాపిరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment