సమస్యలపై సంఘటితంగా స్పందించాలి
కోనేరుసెంటర్: సమాజంలో మహిళలకు ఎదురవుతున్న సమస్యలపై సంఘటితంగా స్పందించాతని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఉమెన్ ఎంపవర్మెంట్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ ఇంప్లిమెంటేషన్ కమిటీ సభ్యురాలు సూయజ్ రావూరి మాట్లాడుతూ మహిళల కోసం అనేక చట్టాలను ప్రభుత్వాలు రూపొందిస్తున్నాయని, వాటిపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలని తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ తేజస్వి పొన్నం మాట్లాడుతూ మహిళలు చేసే కార్యక్రమాలను ప్రోత్సహించడం అలవాటుగా చేసుకోవాలన్నారు. రెక్టర్ ఆచార్య ఎంవీ బసవేశ్వరరావు మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి దేశంలో మహిళలకు గౌరవం ఇస్తున్న దేశం మనదేశం అన్నారు. ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.ఉష మాట్లాడుతూ చదువు ఒక్కటే మహిళల అభ్యున్నతికి దోహదపడుతుందన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎం.శ్రావణి మాట్లాడుతూ ఉద్యోగాలు చేసే మహిళలపై ఆయా ప్రదేశాల్లో మానసిక ఒత్తిడికి గురి చేసే పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నాయిని, వాటిని అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయకుమారి మాట్లాడుతూ మహిళా ఉద్యోగుల కోసం ప్రభుత్వం రూపొందించిన చట్టాలను కృష్ణా విశ్వవిద్యాలయంలో అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉమెన్ ఎంపవర్మెంట్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎల్.సుశీల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలు అంశాలపై నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు ఆచార్యులు, సహాయ ఆచార్యులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
మహిళా దినోత్సవంలో వక్తలు కేయూలో ఘనంగా మహిళా దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment