భూ రీ సర్వే పరిశీలించిన కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ
మేళ్లమర్తిలంక(మోపిదేవి): రైతులకు ఎలాంటి అనుమానాలు లేకుండా భూ రీ సర్వే జాగ్రత్తగా చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రీ సర్వే అధికారులకు స్పష్టంచేశారు. మండల పరిధిలోని ఉత్తర చిరువోలుంక గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా జరుగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. తొలుత గ్రామ సచివాలయంలో పలు రికార్డులు పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతు విశ్వనాథపల్లి నాగరాజుకు చెందిన సర్వే నంబర్ 56/2లో 1.10 ఎకరాల భూమి ఉండగా 94 సెంట్లు మాత్రమే రెనెన్యూ రికార్డుల్లో అధికారులు చూపుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రికార్డులు పరిశీలించి రైతు భూమిని జిల్లా కలెక్టరే దగ్గర ఉండి భూ రీ సర్వే చేశారు. ఈ సర్వేలో కూడా 94 సెంట్లు మాత్రమే వచ్చిందని అధికారులు వివరించారు. జిల్లా ఏడీ ఎం జోషిలా, మచిలీపట్నం ఆర్డీవో కె.స్వాతి, ఆర్‌ఎస్ డీటీ వాణి, మండల సర్వేయర్ రామకృష్ణ, వీఆర్వోలు ప్రశాంత్, మోపిదేవి వెంకటేశ్వరావు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment