కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
ఏపీ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ఫెడరేషన్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ ఫెడరేషన్(సీఐటీయూ) డిమాండ్ చేసింది. విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో శుక్రవారం మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం కన్వీనర్ బి.ముత్యాలరావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు తమ డిమాండ్ల సాధనకు ఐక్య ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ – ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలన్నారు. అనంతరం డీఎంఏ అధికారులు ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment