గణపేశ్వరం దుర్గమ్మ గుడికి వెండి ఆభరణాలు సమర్పణ
గణపేశ్వరం(నాగాయలంక): గ్రామంలోని పురాతనమైన చారిత్రక దేవాలయం శ్రీదుర్గాగణపేశ్వర స్వామి ఆలయాల్లోని శ్రీదుర్గమ్మ గుడికి దాతలు రూ.1.31 లక్షల విలువైన వెండి ఆభరణాలను వితరణ చేశారు. బందరు మాజీ ఎంపీ దివంగత నేత మండల వెంకటస్వామి నాయుడు కుటుంబ సభ్యులు ఈ మేరకు అమ్మవారి వెండి విగ్రహం(రూ.30,300), శ్రీచక్రం(రూ.28,896) శంఖం(రూ.18,748), ఏనుగు ప్లేట్(రూ.49,275), వెండి నవరత్నాల ఉంగరం(రూ.3,816) మాజీ ఎంపీ తనయుడు, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మండల శ్రీరామమూర్తి(రాంబాబు)–అరుణ దంపతుల చేతుల మీదుగా వీటిని ఆలయ అర్చకుడు పోతుకూచి సత్యనారాయణశాస్త్రికి శుక్రవారం అందజేశారు. తొలుత వెండి ఆభరణాలకు శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment