సుబ్రహ్మణ్యుని సేవలో కృష్ణా కలెక్టర్
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట మచిలీపట్నం ఆర్డీవో కె. స్వాతి, స్థానిక ఎస్‌ఐ సత్యనారాయణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
పేలిన ఫ్రిడ్జ్.. వంటింటి సామగ్రి ధ్వంసం
మైలవరం: వంటింట్లో ఫ్రిడ్జ్ పేలి సామాన్లు ధ్వంసం అయిన సంఘటన ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పూరగుట్టలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పూరగుట్ట గ్రామానికి చెందిన మరీదు నిరంజన్‌రావు, రమాదేవి దంపతులు కూలి పనులు చేసుకుని జీవిస్తుంటారు. గురువారం రాత్రి వారు బెడ్‌రూమ్‌లో నిద్రపోయారు. శుక్రవారం తెల్లవారుజామున వంట గదిలోని ఫ్రిడ్జ్ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ పేలుడు ధాటికి ఇంటి తలుపులు, కిటికీలు విరిగిపోయాయి. వంట గదిలోని సామాన్లు చెల్లాచెదురుగా పడ్డాయి. దంపతులు బెడ్‌రూమ్‌లో పడుకుని ఉండటం, వంటగదిలో గ్యాస్ సిలిండర్ ఉన్నా అది పేలకపోవడంతో ఎటువంటి అపాయం జరగలేదు. ఫ్రిడ్జ్ పేలుడు శబ్దానికి చుట్టు పక్కల వారు భయాందోళనకు గురయ్యారు. పేలిన శబ్దం అర కిలోమీటరు వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు.
దుర్గమ్మ సన్నిధిలోనీతి అయోగ్ సభ్యుడు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మను నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ విజయ్‌కుమార్ సరస్వత్ శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన విజయ్‌కుమార్ సరస్వత్‌ను ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలకగా, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఏఈవో జంగం శ్రీనివాసరావు విజయ్‌కుమార్ సరస్వత్‌కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు.
కృష్ణా డీఆర్డీఏ పీడీగా హరిహరనాథ్
చిలకలపూడి(మచిలీపట్నం): డీఆర్డీఏ పీడీగా వై. హరిహరనాథ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి డీఆర్డీఏ పీడీగా ఆయనను నియమిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన కలెక్టర్ డీకే బాలాజీని ఆయన చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు.
సుబ్రహ్మణ్యుని సేవలో కృష్ణా కలెక్టర్
సుబ్రహ్మణ్యుని సేవలో కృష్ణా కలెక్టర్
సుబ్రహ్మణ్యుని సేవలో కృష్ణా కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment