మహిళలపై వివక్ష, సవాళ్లపై చర్చ
భవానీపురం(విజయవాడపశ్చిమ): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషరేట్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్యానల్ డిస్కషన్ జరిగింది. ‘అదృశ్య అవరోధాలను ఛేదించడం – మహిళల నాయకత్వం – సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి వి. అనిత, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర్ బాబు, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. మహిళలు నాయకత్వ స్థాయికి ఎదగడంలో ఎదుర్కొనే సవాళ్ల, అవరోధాలు, వివక్షను అధిగమించే మార్గాల గురించి చర్చించారు. హోం మంత్రి అనిత మాట్లాడుతూ మహిళను విమర్శించే క్రమంలో ముందు క్యారెక్టర్‌ను దూషిస్తారన్నారు. బీసీ వెల్ఫేర్ మంత్రి సవిత మాట్లాడుతూ రాజకీయంగా అనేక ఒడుదుడుకులను ఎదుర్కొన్నానని చెప్పారు. అలాగే అనేక కేసులు, అవమానాలు పడుతూ ఈ స్థాయికి వచ్చానని తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ
Comments
Please login to add a commentAdd a comment