
ప్రతి పురుషుడి విజయం వెనుక మహిళ
మచిలీపట్నంటౌన్: ప్రతి పురుషుడి విజయం వెనుక సీ్త్ర మూర్తి హస్తం తప్పక ఉంటుందని కృష్ణా జిల్లా కలెక్టర్ సతీమణి పృథ్వీకళ్యాణి అన్నారు. స్థానిక ఈడేపల్లిలోని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) హాల్‌లో ఆ సంఘ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు కలెక్టర్ సతీమణి పృథ్వీకళ్యాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలను గౌరవించేరోజన్నారు. ఒక పురుషుని విజయం వెనుక ఒక తల్లి, చెల్లి, అక్క, కూతురు, భార్య ఇలా ఎవరో ఒక సీ్త్ర మూర్తి ఉండే ఉంటారన్నారు. వారి త్యాగాలను గుర్తిస్తూ వారి శక్తిని రెండింతలు చేసేలా ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆశాలత, యూటీఎఫ్ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా పృథ్వీకళ్యాణిని ఘనంగా సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment