
నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు చర్యలు
మచిలీపట్నంటౌన్: జిల్లాలో ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎం. సత్యానందం అన్నారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో విద్యుత్ శాఖాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎస్‌ఈ మాట్లాడుతూ రాబోయే వేసవి కాలంలో విద్యుత్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి వినియోగదారుడికి నాణ్యమైన విద్యుత్ అందించాలన్నారు. అలాగే మార్చి నెలకు సంబంధించి ఈ నెల 25వ తేదీలోపే నూరుశాతం బిల్లులు చెల్లించేలా చూడాలన్నారు. వినియోగదారునికి బిల్లు ఇచ్చిన 15 రోజుల్లోగా చెల్లింపులు చేసేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో విద్యుత్‌శాఖ జి. గోవిందరావు, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment