
అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు మత్తి అరుణ
గూడూరు: ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలకు గూడూరు జెడ్పీ హైస్కూలు పీడీ మత్తి అరుణ ఎంపికయ్యారు. మాస్టర్ అథ్లెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండి యా ఆధ్వర్యంలో బెంగళూరులో ఈనెల 4 నుంచి 9 వరకు నిర్వహించిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలో ఆమె ఆంధ్ర ప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ జాతీయ స్థాయిలో పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన మత్తి అరుణ రెండు పతకాలు సాధించి సత్తాచాటారు. 4’400 మీటర్స్ రన్నింగ్‌లో బంగారు పతకం, 4’100 మీటర్స్ రన్నింగ్‌లో కాంస్య పథకం సాధించారు. తద్వారా ఇండోనేషియాలో జరగబోయే ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించడమే కాకుండా అంతర్జాతీయ పోటీలకు ఎంపికై గూడూరు హైస్కూలు పేరు ప్రఖ్యాతులు మార్మోగేలా చేసిన మత్తి అరుణకు సోమవారం పాఠశాల విద్యాకుటుంబం ఘనస్వాగతం పలికింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి.పుష్పలత మాట్లాడుతూ మత్తి అరుణ పతకాలు సాధించడం పాఠశాలకు గర్వకారణమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment