
అనాథ పిల్లల సంరక్షణకు చర్యలు
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): శిశు గృహాల్లో ఉన్న అనాథ పిల్లలను పోర్టల్ ద్వారా దత్తత తీసుకునేందుకు వీలుగా ‘కారా’ పోర్టల్‌లో వివరాలను అప్‌డేట్ చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కేవీ రామకృష్ణయ్యతో కలిసి అనాథ పిల్లల దత్తత, ఇతర సమస్యలపై అధికారులతో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ అనాథ పిల్లల సంరక్షణ చర్యల్లో భాగంగా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(కారా) పోర్టల్‌లో వివరాలను అప్‌డేట్ చేయాలన్నారు. అనాథ పిల్లలను, పిల్లల సంక్షేమ కమిటీ ద్వారా లీగల్లీ ఫ్రీ ఫర్ అడాప్షన్ సర్టిఫికెట్ మంజూరు చేసి కారా వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. పిల్లల సంరక్షణ సంస్థల్లో రక్షణ పొందుతున్న పిల్లలందరూ చట్టపరిధిలోకి తీసుకువచ్చే విధంగా ఆ సంస్థలను రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూడాలన్నారు. అనాథ పిల్లలకు సంబంధించిన ఆధార్‌కార్డులను సేకరించి గ్రామ, వార్డు సచివాలయ అధికారులకు సమర్పించాలన్నారు. తద్వారా ప్రభుత్వం ద్వారా లభించే పథకాలకు వారి పేర్లను నమోదు చేయడానికి వీలవుతుందన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, డీఎంఅండ్‌హెచ్‌వో శర్మిష్ట, డీఈవో ఎంవీజే రామారావు, సీపీవో గణేష్‌కృష్ణ, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా సమన్వయ అధికారి కె. రవికాంత్ పాల్గొన్నారు.
హెవీ వెహికల్ డ్రైవింగ్‌లో శిక్షణ పూర్తి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ది కృష్ణాజిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న డ్రైవింగ్ స్కూల్‌లో హెవీ వెహికల్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సోమవారం సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చాంబ ర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొని సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో రవాణా వ్యయం జి.డి.పి.లో 8 శాతమే ఉండ గా, మన దేశంలో 14 శాతం ఉండటం వల్ల ఎగుమతుల పరంగా పోటీపడలేని స్థితి నెలకొందన్నారు. రహదారిపై వాహనం నడిపేవారు సమయ స్ఫూర్తి, ఓర్పు, సహనం ఎల్లవేళలా కలిగి ఉంటే రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉండదన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు నాగుమోతు రాజా, ఉపాధ్యక్షుడు కె.వి.ఎస్.చలపతిరావు, కార్యదర్శి రావి శరత్ బాబు, కోశాధికారి పొట్లూరి చంద్రశేఖరరావు, లారీ ఓనర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్షులు కోనేరు జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నిత్యాన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం
మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో నిత్యన్నదానానికి మచిలీపట్నంకు చెందిన సర్వా లలిత రూ. లక్ష విరాళంగా అందజేశారు. ఉదయం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం నిత్యన్నదానానికి విరాళాన్ని ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు చెక్కు రూపంలో అందచేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు.

అనాథ పిల్లల సంరక్షణకు చర్యలు
Comments
Please login to add a commentAdd a comment