స్విమ్మింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
విజయవాడస్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ (ఏపీఏ ఏఏ) రాష్ట్ర నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా ఎం. ఓబుల్ రెడ్డి, ఎం. మోహనవెంకటరామ్ ఎన్నికయ్యారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్ లో రాష్ట్ర సంఘం ఎన్నికలు జరిగాయి. సంఘ చైర్మన్‌గా డాక్టర్ కె. రవికాంత్, గౌరవాధ్యక్షుడిగా పి.గోవిందరాజు, ఉపాధ్యక్షుడిగా రవి శంకర్ రెడ్డి, ప్రసాద్, శ్రీనివాసరావు, మధు, భాస్కర్, సతీష్, సహాయ కార్యదర్శులుగా మల్లికార్జునరావు, వినోద్, శ్రీధర్, సుబ్బారెడ్డి, నటరాజరావు, కోశాధికారిగా ఐ. రమేష్, కార్యవర్గ సభ్యులుగా కాజ మొహిద్దిన్, నాగ మురళి, దేవుడు, శంకర్ రెడ్డి, మేఘన లను సభ్యులు ఎన్నుకున్నారు. 2028 వరకు వీరంతా సంఘ ప్రతినిధులుగా కొనసాగుతారు.
జూడో రాష్ట్ర జట్లు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: జాతీయ జూనియర్ జూడో క్రీడా పోటీలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర జట్లను ఎంపిక చేసినట్టు ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ సీఈవో వెంకట్ నామిశెట్టి తెలిపారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్ర జట్టు ఎంపిక పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన క్రీడాకారులను ఎంపిక చేశామన్నారు. బాలుర జట్టుకు తేజకుమార్, తిరుమల, దిలీప్ కుమార్ రెడ్డి, ఉదయ్ కిరణ్, గోవర్ధన్, గగన్ సాయి, శివ సాయి, రంగస్వామి, బాలికల జట్టుకు ప్రవల్లిక, లక్ష్యా రెడ్డి, వైష్ణవి, అలేఖ్య, కీర్తన, భావన, రిషిత కృష్ణ, కోటేశ్వరి ఎంపికై నట్లు తెలిపారు. ఈ నెల 28 నుంచి ఉత్తరా ఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. జట్టుకు ఎంపికై న క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ రవినాయుడు, ఆంధ్రప్రదేశ్ జూడో సంఘం అధ్యక్షుడు గణేష్ సుబ్బారావు, సంయుక్త కార్యదర్శి గమిడి శ్రీనివాస్, ఉషారాణి, కోచ్ తేజ, శ్రీను శాప్ కార్యాలయంలో మంగళవారం అభినందించారు.
మధ్యకట్టకు మరమ్మతులు ప్రారంభం
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఎట్టకేలకు నగరపాలకసంస్థ అధికారులు బుడమేరు మధ్యకట్టలో బుడమేరుకు పడిన గండికి మరమ్మతులు ప్రారంభించారు. బుడమేరు వరదల సమయంలో బుడమేరు మధ్యకట్టలో గండి పడింది. బుడమేరులో వరదప్రవాహం గండి ద్వారా ఏలూరు కాలువలోకి ప్రవహించింది. దీంతో రోడ్డు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉద్ధృతి తగ్గిన తరువాత తూతూ మంత్రంగా బుడమేరులోని మురుగునీరు ఏలూరు కాలువలోకి రాకుండా కొద్దిపాటి మట్టిని వేసి వదలేశారు. దీంతో అప్పటి నుంచి ఇక్కడ రాకపోకలు నిలిచిపోవటంతో స్థానికులు పడుతున్న అవస్థలు వివరిస్తూ ‘సాక్షి’ పలుమార్లు కథనాలు ప్రచురించింది. దీనిపై స్పందించిన అధికారులు ఎట్టకేలకు మరమ్మతు పనులు ప్రారంభించారు.
27న ఉప సర్పంచ్ ఎన్నికలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలలో ఈనెల 27న ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి లావణ్య కుమారి ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో జి. కొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామ పంచాయతీ, వత్సవాయి మండలం మంగొల్లు, ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం, విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. పంచాయతీల ప్రిసైడింగ్, అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారి హాజరై ఓరియంటేషన్ కార్యక్రమంలో సూచనలు, సలహాలు ఇచ్చారన్నారు. కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి జీఎల్‌ఎల్‌వీఎన్ రాఘవన్ పాల్గొని ఓరియంటేషన్‌ను విజయవంతం చేశారన్నారు.
స్విమ్మింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
స్విమ్మింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం