జూట్‌ బ్యాగులు కొనాల్సిందే! | - | Sakshi
Sakshi News home page

జూట్‌ బ్యాగులు కొనాల్సిందే!

Published Thu, Apr 3 2025 2:08 PM | Last Updated on Thu, Apr 3 2025 2:08 PM

జూట్‌

జూట్‌ బ్యాగులు కొనాల్సిందే!

నాడు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో జగన్‌మోహన్‌రెడ్డి డ్వాక్రా అక్కచెల్లెమ్మలను వ్యాపారవేత్తలుగా తయారుచేసేందుకు మహిళా మార్ట్‌లు ప్రారంభించి గొప్ప ప్రయోగం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నష్టాల పేరుతో మహిళా మార్టులను మూసివేసింది. డ్వాక్రా మహిళలను వ్యాపారులుగా కాకుండా కొనుగోలుదారులుగానే చూస్తూ వారికి బలవంతంగా పచ్చళ్లు, జ్యూట్‌బాగ్‌లను అంటగడుతోంది.
బలవంతం ఏమీ లేదు...

పెడన: వైఎస్సార్‌ సీపీ హయాంలో డ్వాక్రా అక్కాచెల్లెమ్మలను ఉన్నత స్థితికి తీసుకువచ్చేందుకు మహిళా మార్ట్‌లను ఏర్పాటు చేసి వారిని వ్యాపార వేత్తలుగా మలచడానికి చిత్తశుద్ధిగా కృషి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ముందుగా మహిళా మార్ట్‌లను మూసివేశారు. ఇప్పుడు పచ్చళ్లు, జ్యూట్‌ బ్యాగులు డ్వాక్రా మహిళలతో బలవంతంగా కొనుగోలు చేసేలా ఒత్తిడి తెస్తున్నారు. వేలాది గ్రూపులను వదిలి పెట్టి ఏదో నాలుగైదు గ్రూపులకు మాత్రమే లబ్ధి చేకూర్చేలా యంత్రాంగం ప్రయత్నాలు చేయడాన్ని డ్వాక్రా మహిళలు తప్పుబడుతున్నారు. ఆ మాత్రం పచ్చళ్లు మేం ఇళ్ల వద్ద పట్టుకోలేమా అంటూ వాపోతున్నారు. జ్యూట్‌ బ్యాగులు తమకెందుకు అంటగడుతున్నారంటూ మథనపడుతున్నారు.

ఏడెనిమిది రకాల పచ్చళ్లు...జ్యూట్‌ బ్యాగులు..

ఏడెనిమిది రకాల పచ్చళ్లు అర కేజీ సీసాలను అంటగడుతున్నారు. గోంగూర, నిమ్మ, మామిడి, అల్లం, పండుమిర్చి, ఉసిరి, టమాటో పచ్చళ్లతో పాటు జ్యూట్‌ బ్యాగులు నాలుగు రకాల డిజైన్లు కల వాటిని అంటగడుతున్నారు. పచ్చడి అర కేజీ రూ.150.30 పైసలు. జ్యూట్‌బ్యాగు వెల రూ.144. మొదట్లో ఒక్కో గ్రూపు పది పచ్చడి సీసాలు లేదా పది జ్యూట్‌ బ్యాగులు కొనుగోలు చేయాల్సిందేనని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఆ తరువాత ఏవైనా పది కొనుగోలు చేయాలన్నారు. ఆ తరువాత ప్రతి గ్రూపు కూడా రెండు చొప్పున కొనుగోలు చేయాల్సిందేనని పేర్కొనడంతో పాటు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకువచ్చారు. ఒత్తిళ్లు భరించలేక కొందరు ఆర్పీలు సభ్యులకు తరువాత విక్రయించుదామని చెప్పి ముందుగా పెట్టుబడు లు పెట్టి పచ్చడి సీసాలు, జ్యూట్‌బ్యాగులు కొనుగోలు చేసి వారి వద్ద ఉంచుకుని, సభ్యులకు నిదానంగా అంటగడుతున్నారు.

మండలాల్లో 29,529,

పట్టణాల్లో 9,518 గ్రూపులు

జిల్లా వ్యాప్తంగా సెర్ఫ్‌ ఆధ్వర్యంలో స్వయం సహాయక గ్రూపులు 29,529 ఉన్నాయి. వీటిల్లో 3,06,936 మంది గ్రూపు సభ్యులున్నారు. పట్టణాల్లో 9,518 గ్రూపులుండగా వీటిలో సుమారుగా 95,524 మంది గ్రూపు సభ్యులున్నారు. వీరంతా మెప్మా ఆధ్వర్యంలో రుణాలు పొందుతున్నారు. వీరందరికీ పచ్చళ్లు, జ్యూట్‌ బ్యాగులు ఇవ్వాలని నిర్ణయించి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు నుంచి ఎన్డీయే కూటమిలోని అధికారులు చక్రం తిప్పి గ్రూపు సభ్యులకు అంటగడుతూ వస్తున్నారు.

డ్వాక్రా మహిళలపై అధికారుల ఒత్తిడి ప్రతి గ్రూపు నుంచి కనీసం రెండు కొనాలంటూ మౌఖిక ఆదేశాలు ఒత్తిళ్లు భరించలేక కొందరు ఆర్పీలు ముందుగా పెట్టుబడి పెట్టి కొనుగోళ్లు మెప్మా...సెర్ఫ్‌ల ఆధ్వర్యంలో డ్వాక్రా గ్రూపు సభ్యులకు అంటగడుతున్నారు

పచ్చళ్లు, జ్యూట్‌ బ్యాగులు కొనుగోలు చేయాలని ఎవరూ బలవంతం చేయడం లేదు. ఒత్తిళ్లు చేయడం లేదు. ఆర్పీలకు తెలియజేసి ఎవరైనా ఆసక్తి ఉంటే కొనుగోలు చేస్తే వారిని ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసుకోవాలని సూచించాం. ఆ విధంగానే చాలా మంది పచ్చళ్లు, జ్యూట్‌ బ్యాగులను కొనుగోలు చేశారు. పెడనలో 500 వరకు పచ్చడి సీసాలను కొనుగోలు చేశారు. జ్యూట్‌ బ్యాగులు 50 నుంచి 60 వరకు కొనుగోలు చేశారు. ఆర్పీల పైన, గ్రూపు సభ్యులపైన ఎటువంటి ఒత్తిళ్లు చేయలేదు.

– భోగేశ్వరరావు, టీఎంసీ, మెప్మా,

పురపాలక సంఘం, పెడన

జూట్‌ బ్యాగులు కొనాల్సిందే! 1
1/2

జూట్‌ బ్యాగులు కొనాల్సిందే!

జూట్‌ బ్యాగులు కొనాల్సిందే! 2
2/2

జూట్‌ బ్యాగులు కొనాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement