కోనేరుసెంటర్: గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మచిలీపట్నంలోని చిలకలపూడి రైల్వే స్టేషన్‌లో బుధవారం జరిగింది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు.
రైల్వే ఎస్‌ఐ ఎండీ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 6:30 గంటల సమయంలో కొండవీడు ఎక్స్‌ప్రెస్ మచిలీపట్నం వైపు వస్తుండగా సుమారు 40 సంవత్సరాల వయసు గల వ్యక్తి ఒక్కసారిగా రైలు కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన వ్యక్తి సుమారు 5.5 అడుగుల ఎత్తు కలిగి ఎరుపు పచ్చ రంగు ఫుల్ హ్యాండ్ గళ్ళ చొక్కా, సిమెంటు రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు ఎస్‌ఐ షరీఫ్ తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 94406 27050, 73960 69566 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.