
కేడీసీసీబీ టర్నోవర్ రూ.11,307 కోట్లు
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ 2024–25 సంవత్సరానికి సంబంధించి రూ.11,307.14 కోట్ల టర్నోవర్ సాధించిందని బ్యాంక్ ప్రత్యేకాధికారి, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ బుధవారం తెలిపారు. టర్నోవర్ గత సంవత్సరం కంటే రూ.257.32 కోట్ల మేర పెరిగిందన్నారు. బ్యాంకులో షేర్ క్యాపిటల్ రూ.393.70 కోట్ల నుంచి రూ.418.50 కోట్లకు పెరిగిందని వివరించారు. డిపాజిట్లు రూ.3,094.40 కోట్ల నుంచి రూ.3,265.20 కోట్లకు పెరిగాయని తెలిపారు. గత సంవత్సరం రూ.7,955.42 కోట్ల రుణాలు ఇవ్వగా ఈ సంవత్సరం రూ.8,041.94 కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. రుణాలు రూ.86.52 కోట్ల మేర పెరిగాయన్నారు. దీంతో బ్యాంకు టర్నోవర్ రూ.11,049.82 కోట్ల నుంచి రూ.11,307.14 కోట్లు చేరిందని వివరించారు. బ్యాంకుకు నికర ఆదాయం రూ.99.27 కోట్లు వచ్చిందని గీతాంజలి శర్మ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకార బ్యాంకు అనుబంధంగా 425 పీఏసీఎస్‌లలో కంప్యూటరీకరణ చేపట్టగా ఇప్పటి వరకు 314 పీఏసీఎస్‌లలో 74 శాతం మేర పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. నూతనంగా 66 మంది స్టాఫ్ అసిస్టెంట్లను నియమించేందుకు నోటిఫికేషన్ జారీ చేశామని వెల్లడించారు. వారికి త్వరలో రాతపరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. 2024 నవంబర్ 26వ తేదీన నాప్కాబ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేడీసీసీ బ్యాంక్ బెస్ట్ ఫెర్ఫార్మిగ్ బ్యాంక్‌గా నిలిచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చేతుల మీదుగా అవార్డు అందుకున్నామని గుర్తుచేశారు.
నికర ఆదాయం రూ.99.27 కోట్లు ప్రత్యేకాధికారి గీతాంజలిశర్మ

కేడీసీసీబీ టర్నోవర్ రూ.11,307 కోట్లు