
అగ్ని గండం.. అప్రమత్తం!
పామర్రు: కృష్ణాజిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా పది నెలల్లోనే 700కు పైగా అగ్ని ప్రమాదాలు జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. పల్లెల్లో కంటే పట్టణాల్లోనే ఎక్కువగా అగ్ని ప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా గతంలో గ్రామాల్లో గడ్డి వాములు, ఎండిపోయిన పైర్లు వంటి వాటి వల్ల ప్రమాదాలు జరిగేవి. కానీ ఇప్పుడు పట్టణాల్లో గ్యాస్ లీకేజ్, ఎలక్ట్రికల్ షార్టు సర్క్యూట్‌ల కారణంగా 70 శాతం ప్రమాదాలు జరుగుతుండటం గమనార్హం.
భారీగా ఆస్తి నష్టం
విద్యుత్ స్తంభాలు, లైన్‌లు, వైరింగ్ సరిగా లేకపోవడం తదితర కారణాల వల్ల ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటి నిర్వహణ విషయంలో విద్యుత్ అధికారులు దారుణంగా విఫలమవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక పట్టణాల్లోని చాలా ఇళ్లలో వెంటిలేషన్ సరిగా లేకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరుగుతున్నట్లు అంచనా. ఈ ఏడాది అగ్ని ప్రమాదాల్లో ప్రాణ నష్టం జరగనప్పటికీ 14 జీవాలు మృతి చెందాయి. ఎండ తీవ్రతకు వాహనాలు విపరీతంగా వేడెక్కి వాటి నుంచి మంటలు చెలరేగుతున్నాయి. నాలుగు మాసాల క్రితం విజయవాడ–మచిలీపట్నం హైవే సమీపంలో కారులో మంటలు వ్యాపించి దగ్ధమైంది.
జిల్లాలో ఫైర్ స్టేషన్లు
ఈ ఏడాది సాధారణ అగ్నిప్రమాదాలు
మధ్యస్థ
జాగ్రత్తలు పాటించాలి
● వెలుతురు సరిగా లేని ఇళ్లలో రాత్రి గ్యాస్ సిలిండర్‌కు సంబంధించి రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి.
● సిలిండర్ ఆన్‌లో ఉంచి కిచెన్‌లో లైట్లు వేయకూడదు.
● ఎలక్ట్రిక్ స్విచ్‌లు వేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
● విద్యుత్ స్తంభాల వద్ద కరెంట్ ఎర్త్ అవుతుందేమో గమనిస్తుండాలి.
● ఏసీలు, హీటర్లు వాడుతున్నప్పుడు నిప్పు రవ్వలు చెలరేగుతున్నాయేమో గమనించాలి.
● బైక్, స్కూటర్ లేదా కారు ఇంజిన్ వేడెక్కినప్పుడు కాస్త విరామం ఇవ్వాలి.
అగ్నిమాపక వాహనాలు
భారీ అగ్ని ప్రమాదాలు 2
ప్రమాదాల్లో ఆస్తి నష్టం రూ. 5.17కోట్లు
10పెద్దవి, 2 చిన్నవి
అప్రమత్తంగా ఉండాలి
గ్యాస్, ఎలక్ట్రిక్ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.వేసవి నేపధ్యంలో మరో మూడు నెలలు ప్రజలు అప్రమర్తంగా ఉండాలి. వంట పూర్తివగానే సిలిండర్ ఆపేస్తే మంచిది. ఎలక్ట్రిక్ వస్తువులపై నిఘా ఉంచాలి.ఇరుగు గదుల్లో ఉండే దుకాణ దారులు,షాపింగ్ మాల్‌స యజమానులు నిరంతరంచెక్ చేసుకుంటూ ఉండాలి.
–డి.ఏసురత్నం, జిల్లా అగ్నిమాపక అధికారి, కృష్ణాజిల్లా
●
పది నెలల్లో 700కు పైగా అగ్ని ప్రమాదాలు రూ.5 కోట్లకు పైగా ఆస్తి నష్టం ఎక్కువగా గ్యాస్, ఎలక్ట్రిక్ వస్తువుల వలనే... వేసవిలో అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు
709
9
34

అగ్ని గండం.. అప్రమత్తం!