పర్యాటకం శోభించేలా.. | - | Sakshi
Sakshi News home page

పర్యాటకం శోభించేలా..

Published Wed, Sep 27 2023 1:54 AM | Last Updated on Wed, Sep 27 2023 12:42 PM

కర్నూలు ఎయిర్‌ పోర్టు                                                పాండురంగాపురం ఏరియల్‌ వ్యూ   - Sakshi

కర్నూలు ఎయిర్‌ పోర్టు పాండురంగాపురం ఏరియల్‌ వ్యూ

కర్నూలు కల్చరల్‌/ నంద్యాల(సెంట్రల్‌): ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రదానం చేస్తున్న టూరిజం ఎక్సలెన్స్‌ అవార్డుల్లో జిల్లాకు స్థానం దక్కింది. బెస్ట్‌ ఫ్రెండ్లీ ఎయిర్‌పోర్టు విభాగంలో కర్నూలు ఎయిర్‌ పోర్టు టూరిజం ఎక్సలెన్స్‌ అవార్డును దక్కించుకుంది. దీంతో పాటు జిల్లా పర్యాటక సాంస్కృతిక శాఖ అధికారిణి పి.విజయ ఉత్తమ పర్యాటక, సాంస్కృతిక అధికారిగా అవార్డుకు ఎంపికయ్యారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ విద్యాసాగర్‌, జిల్లా పర్యాటక సాంస్కృతిక శాఖ అధికారిణి పి.విజయ బుధవారం విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో అవార్డులను అందుకోనున్నారు.

పర్యాటక దినోత్సవ వేడుకలు వాయిదా
కర్నూలు జిల్లా పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 27న నిర్వహించాల్సిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడకులు కొన్ని అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు జిల్లా పర్యాటక సాంస్కృతిక శాఖ అధికారి పి.విజయ తెలిపారు. వేడుకలను ఈనెల 28న సాయంత్రం 5 గంటలకు సిల్వర్‌ జూబ్లీ కళాశాలలో నిర్వహిస్తామన్నారు. పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వ్యాస రచన, వక్తృత్వ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్‌ డి.సృజన, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా మెరిట్‌ సర్టిఫికెట్‌లు అందజేస్తామన్నారు.

నంద్యాల జిల్లాకు నాలుగు అవార్డులు
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర స్థాయిలో నంద్యాల జిల్లాకు నాలుగు విభాగాల్లో స్టేట్‌ ఎక్సలెన్సీ అవార్డులు దక్కినట్లు జిల్లా పర్యాటక–సాంస్కృతిక అధికారి సీ.హెచ్‌.ఎస్‌.సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హరిత టూరిజం హోటల్స్‌లో నుంచి ఉత్తమ మేనేజర్‌ కేటగిరీలో శ్రీశైలం హరిత హోటల్‌ నిర్వహణాధికారి పవన్‌కుమార్‌కు అవార్డు వరించినట్లు ఆయన వెల్లడించారు. దీంతో పాటు ఉత్తమ గ్రామీణ పర్యాటక గ్రామంగా అహోబిలం, ఉత్తమ సివిక్‌ మేనేజ్‌మెంట్‌ గ్రామంగా పాండురంగాపురం, ఉత్తమ ఫ్రెండ్లీ ఆర్కియలాజికల్‌ మాన్యుమెంట్‌గా బెలుం గుహలు ఎంపికై నట్లు ఆయన పేర్కొన్నారు.

ఉత్తమ గ్రామీణ పర్యాటక గ్రామం అవార్డును అహోబిలం దేవస్థానం కమ్యూనికేషన్స్‌ అధికారి సేతురామన్‌, ఉత్తమ ఫ్రెండ్లీ ఆర్కియలాజికల్‌ మాన్యుమెంట్‌ అవార్డును పురావస్తు శాఖ సహాయ సంచాలకురాలు రజిత, ఉత్తమ సివిక్‌ మేనేజ్‌మెంట్‌ అవార్డును పాండురంగాపురం సర్పంచ్‌ యర్రబోలు డోలావతమ్మ అందుకోనున్నట్లు తెలిపారు. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ఉన్నతాధికారుల చేతుల మీదుగా సత్కారం పొందనున్నట్లు పేర్కొన్నారు.

పర్యాటకానికి జిల్లా కలెక్టర్‌, జిల్లా పర్యాటక మండలి చైర్మన్‌ ఇస్తున్న ప్రాధాన్యతతోనే ఈ అవార్డులు సాధ్యమైనట్లు ఆయన హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా టూరిజం శాఖ తరపున పెయింటింగ్‌, వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో వివిధ పాఠశాలలు, కాలేజీలకు చెందిన 200 మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/5

బెలుంగుహలు                                                         అహోబిలం దేవసఇ్థానం2
2/5

బెలుంగుహలు అహోబిలం దేవసఇ్థానం

3
3/5

శ్రీశైలం హరిత హోటల్‌ మేనేజర్‌ పవన్‌ కుమార్‌ 4
4/5

శ్రీశైలం హరిత హోటల్‌ మేనేజర్‌ పవన్‌ కుమార్‌

కర్నూలు జిల్లా పర్యాటక సాంస్కృతిక శాఖ అధికారిణి పి.విజయ 5
5/5

కర్నూలు జిల్లా పర్యాటక సాంస్కృతిక శాఖ అధికారిణి పి.విజయ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement