![మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యం](/styles/webp/s3/article_images/2024/11/22/21knl22b-200005_mr-1732219253-0.jpg.webp?itok=ECoVADTn)
మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యం
● జాయింట్ కలెక్టర్ నవ్య
కర్నూలు(అగ్రికల్చర్): మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని జాయింట్ కలెక్టర్ బి.నవ్య అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ కార్యక్రమానికి జేసీ ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భగా కెనరా బ్యాంకు ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డుల కింద జిల్లా మత్స్యకార కో–ఆపరేటివ్ సొసైటీలోని 48 మంది సభ్యులకు రూ.12.85 లక్షల రుణాలు పంపిణీ చేశారు. ఉత్తమ మహిళ కో–ఆపరేటివ్ సభ్యురాలుగా రాణిస్తున్న సునీతమ్మను, మార్కెటింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్న కౌసల్యను జేసీ సత్కరించారు. త్రీవీలర్‌పై చేప ఉత్పత్తులను విక్రయిస్తున్న భారతి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మత్స్యకారురాలుగా ఎంపిక కావ డం పట్ల అభినందనలు తెలిపారు. అనంతరం జేసీ మాట్లాడుతూ... మత్స్యకారుల అభివృద్ధికి ఇటు ప్రభుత్వం, అటు బ్యాంకులు సహకరిస్తుండటం శుభపరిణామమన్నారు. కర్నూలు నగరానికి దగ్గరగా ఉన్న హైదరాబాద్, బెంగళూరు నగరాలకు చేపలను ఎగు మతి చేయడం ద్వారా మంచి లాభాలు ఉంటాయని చెప్పారు. అంతకు ముందు జిల్లా మత్స్య శాఖ అధి కారిణి శ్యామల.. జిల్లాలోని చేపల చెరువులు, చేపల పెంపకం, అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యకారుల కో–ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాసులు, కెనరాబ్యాంకు ఆర్ఎం సుశాంత్‌కుమార్, డీసీఓ రామాంజనేయులు, మత్స్యశాఖ అధికారులు సంధ్యారాణి, శేఖర్, మత్స్య సహకార సంఘంసభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment