
భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం
కోడుమూరు రూరల్: కోడుమూరు ఎకై ్సజ్ పరిధిలోని కృష్ణగిరి క్వారీ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన రూ.1.60 లక్షల విలువైన కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కోడుమూరు ఎకై ్సజ్ సీఐ మంజుల బుధవారం తెలిపారు. సీఐ కథనం మేరకు వివరాలు.. తెలవారుజామున సిబ్బందితో కలిసి కృష్ణగిరి క్వారీ వద్ద సోదాలు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన కర్ణాటకకు చెందిన 40 బాక్స్‌ల 3840 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. బైక్‌ను సీజ్ చేసి నిందితుడు బండి లోకేష్‌ను అరెస్ట్ చేశారు. మద్యం సరఫరా చేస్తున్న రాజేంద్రపై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్‌ఐలు చంద్రమోహన్, లక్ష్మి, హెడ్ కానిస్టేబుళ్లు జగన్నాథం, తిరుపాలు, పీరా, కానిస్టేబుళ్లు జగదీష్, సాయి, భూలక్ష్మి, సుజాత, నాగయ్య, విరుపాక్షిరెడ్డి పాల్గొన్నారు.
యువకుడి దుర్మరణం
వెల్దుర్తి: మండల పరిధిలోని రామళ్లకోటకు చెందిన శ్రీనాథ్ (27) బుధవారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. లారీ డ్రైవర్‌గా, క్లీనర్‌గా జీవనం సాగిస్తున్న శ్రీనాథ్ తన గ్రామం నుంచి కాల్వబుగ్గ వైపు మైనింగ్ ప్రాంతంలో డ్యూటీకి బైక్‌పై వెళ్తూ పెద్దమ్మ గుడి సమీపంలో ముందువెళ్తున్న జీపును ఢీకొన్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి తల్లి, సోదరి ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
తప్పిపోయిన చిన్నారులు తలిదండ్రుల చెంతకు
శ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్షలాదిగా తరలివచ్చిన భక్తుల మధ్య తప్పిపోయిన చిన్నారులను పోలీసులు గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. నంద్యాల జిల్లా జూపాడుబంగ్లాకు చెందిన ధనంజనేయులు కుమార్తె ఎ.పరిమళ(12), కర్నూలు రచ్చుమర్రి గ్రామానికి చెందిన పార్వతి కుమారుడు ప్రదీప్ (3), దేవమాడకు చెందిన రియాజ్ కుమారుడు రజాక్ (8) తప్పిపోయినట్లు తెలుసుకున్న పోలీసులు కమాండ్ కంట్రోల్ రూంలోని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి కుటుబ సభ్యులకు అప్పగించారు.
కొండచిలువ హల్‌చల్
గడివేముల: గడిగరేవుల గ్రామ సమీపంలోని భోగేశ్వరాలయం ప్రధాన కోనేరులో బుధవారం కొండచిలువ ప్రత్యకమైంది. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు కోనేరులో స్నానాలు చేస్తుండగా కొండచిలువను చూసి భయాందోళనకు గురయ్యారు. ఆలయ సిబ్బంది, స్థానిక పోలీసులు కోనేరులోని భక్తులను బయటకు పంపి, ఫారెస్టు సిబ్బందికి సమాచారమిచ్చారు. ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి విజయలక్ష్మి, ఫారెస్ట్ బీట్ అధికారి అబ్దుల్ కలాం, యాంటీ పౌచింగ్ టీం కొండచిలువను పట్టుకుని గని ఫారెస్టులో వదలడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. కోనేరులో యథావిధిగా స్నానాలాచరించారు.

భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం

భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం

భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment