గురుకులం పిలుస్తోంది!
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్ష రాసేందుకు ఈ నెల 6లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. స్కూల్స్‌లో ప్రవేశం పొందితే ఉచిత విద్యతో పాటు నాలుగు జతల యూనిఫాం, షూస్, ప్లేట్, గ్లాసు, ట్రంక్ బాక్సు, పెన్నులు, పెన్సిల్స్, పుస్తకాలు, టవల్స్, బెడ్‌షీట్స్, మంచాలు అందిస్తారు. అలాగే విద్యార్థులకు గేమ్స్‌లో అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. డైట్ ప్రకారం ఆహారం అందిస్తారు.
5వ తరగతి, ఇంటర్ మొదటి
సంవత్సరం ప్రవేశాలు ప్రారంభం
ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు
ఈ నెల 6 ఆఖరు
స్కూళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే..
కర్నూలు జిల్లా
బాలికల: దిన్నెదేవరపాడు, ఆదోని,
కంబాలపాడు, వెల్దుర్తి, పత్తికొండ.
బాలుర: సి.బెళగల్, అరికెర, చిన్నటేకూరు.
నంద్యాల జిల్లా
బాలికల: లక్ష్మీపురం, ఆళ్లగడ్డ రెగ్యులర్, ఆళ్లగడ్డ
ఆర్‌పీఆర్‌పీ, కోవెలకుంట్ల, డోన్
బాలుర: జూపాడుబంగ్లా, డోన్(ఆర్ )
Comments
Please login to add a commentAdd a comment