నృత్యం.. సంగీతం.. అ‘మోఘ’ం
కర్నూలు కల్చరల్: తల్లిదండ్రుల ప్రోత్సాహం.. గురువుల మార్గదర్శనం.. నృత్యం, సంగీతంలో కామళే మేఘనను ఘనాపాటిని చేశాయి. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నాట్య ప్రదర్శనలు ఈమె అవార్డులు సాధించారు. ఆదో ని పట్టణం ఆర్టీసీ కాలనీకి చెందిన బ్యాంగ్ ఉద్యో గి కామళే రమేష్ బాబు, కామళే విజయలక్ష్మి దంపతలు మూడో కుమార్తె కామళే మేఘన. ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం బీకాం కంప్యూటర్స్ చదువుతున్నారు. ఈ విద్యార్థిని 2015 నుంచి కూచిపూడి, భరత నాట్యంతో పాటు కర్ణాటక సంగీతంలో గాయనిగా సాధన చేయడం మొదలు పెట్టారు. ఆదోనిలో సంవత్సరం క్రితం శ్రీ నృత్య కళా నిలయం బ్రాంచ్‌ను ప్రారంభించి శాసీ్త్రయ కళలను ఇతరులకు నేర్పిస్తూ ఆదర్శంగా నిలిచారు.
ప్రశంసలు..
● నేపాల్ దేశం రాజధానిలోని ఖాట్మాండ్‌లో కామళే మేఘన నృత్య ప్రదర్శనను ఇచ్చి ప్రశంసలు అందుకున్నారు.
● ఇటీవల బెంగళూరులోని జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్‌లో పాల్గొని జాతీయ స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచారు.
● మేఘన తన నృత్య ప్రదర్శనలతో గిన్నిస్ వరల్డ్ రికార్డు, ఏసియా బుక్ ఆఫ్ రికార్డు, భారత్ వరల్డ్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డు, ఇంటర్నేషనల్ ట్రెడిషినల్ బుక్ ఆఫ్ రికార్డు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, ట్రెజర్ హంట్ రికార్డు అందుకున్నారు.
● కోల్‌కతాలో నిర్వహించిన భారత్ సంస్కృతి ఉత్సవ్ పోటీల్లో ప్రెసిడెంట్ అవార్డు కై వసం చేసుకున్నారు.
భావితరాలకు అందిస్తా
శాసీ్త్రయ నృత్యాలు నేర్చుకోవాలనే ఆసక్తి చాలా మంది చిన్నారులకు ఉండటం లేదు. నేను కూచిపూడి నృత్యంలో లెవల్–4, భరత నాట్యంలో మధ్‌యమ, కర్ణాక సంగీతంలో లెవల్–5 పూర్తి చేశాను. చదువుతో పాటు నృత్యమూ ముఖ్యమే. నాకు తెలిసిన విద్యను భావితరాలకు అందించాలన్నదే నా లక్ష్యం. – కామళే మేఘన
కూచిపూడి, భరత నాట్యం,
కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం
ఆదోనికి చెందిన కామళే మేఘన
అత్యుత్తమ ప్రతిభ
Comments
Please login to add a commentAdd a comment