
మహానందీశా...నమోస్తుతే!
మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందిలో బుధవారం రాత్రి కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరుడు నందివాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చాడు. ఈఓ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మలు వేదోక్తంగా పూజలు చేసిన అనంతరం స్వామి, అమ్మవారిని నందివాహనంపై కొలువు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. వేలాది మంది భక్తులు నందివాహనంపై కొలువైన మహానందీశ్వరస్వామి దంపతులను కనులారా తిలకించారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు
పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. కళాకారులు శివుడి వేషధారణలో రాక్షసులతో యుద్ధం, నోటిలో కిరోసిన్ పోసుకుని గాలిలో మంటలు పుట్టించడం లాంటి విన్యాసాలు భక్తులను కనువిందు చేశాయి.
వేలాదిగా తరలివచ్చిన భక్తజనం

మహానందీశా...నమోస్తుతే!
Comments
Please login to add a commentAdd a comment